![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -37 లో.. నేను ధన లేకుండా ఉండలేను. నేను తప్పు చేశాను. నాకు చావే సరైన శిక్ష అని తన అన్నయ్య సీతాకాంత్ కి సిరి బాధని చెప్పుకుంటు ఎమోషనల్ అవుతుంది. నువ్వు అంత పెద్ద తప్పు ఏం చేసావ్ ? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదని సీతాకాంత్ అనగానే. నేను తప్పు చేశాను.. నేనిప్పుడు ప్రెగ్నెంట్ అని సిరి అనగానే సీతాకాంత్ షాక్ అవుతాడు.. నీ ముందు నిల్చునే అర్హత కూడా నాకు లేదు. నీ నమ్మకాన్ని వమ్ము చేసాను. మన శత్రువు కొడుకని నేను పెళ్లి చేసుకోకపోతే నా పరిస్థితేంటని సిరి బాధపడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు..
ఆ తర్వాత సీతాకాంత్ కోపంగా లోపలికి వచ్చి.. మాణిక్యం చేసిన మోసాన్ని గుర్తుకు చేసుకొని ఫ్రస్ట్రేషన్ తో ఇంట్లో ఉన్న సామాన్లని కిందపడేస్తాడు. ఆ తర్వాత తన నాన్న ఫోటో దగ్గరికి వచ్చి తన బాధని, కోపాన్ని చెప్తూ ఎమోషనల్ అవుతాడు. తన నాన్న రాసిన ఉత్తరాన్ని గుర్తుకుచేసుకుంటాడు. అందులో మీ కడుపులో పుడతానని ఉంటుంది. దాన్ని గుర్తుకు చేసుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఒంటరిగా కూర్చొని జరిగిన సంఘటనలు గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. అప్పుడే ధన వచ్చి.. నేను సిరిని మర్చిపోలేకపోతున్నానని అంటాడు. దాంతో రామలక్ష్మి కోప్పడుతుంది. మనం ఏ సిచువేషన్ లోకి వచ్చామో మర్చిపోయావా అని ధనతో రామలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత నాకు సిరి అంటే చాలా ఇష్టమని ధన చెప్పగా.. అయిన మీ పెళ్లి జరగడం అసాధ్యమని రామలక్ష్మి చెప్తుంది. మరొకవైపు శ్రీలత డాక్టర్ అన్న మాటలు గుర్తుకు చేసుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి సిరికి పెళ్లి చెయ్యాలని అంటాడు. నేను అదే అనుకుంటున్న మంచి ఫారెన్ సంబంధం చూసి చెయ్యాలని శ్రీలత అనగానే.. నేను ధనకి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నానని సీతాకాంత్ అంటాడు. అలా అనగానే శ్రీలత షాక్ అవుతుంది. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావని తనని శ్రీలత అడుగుతుంది. పెళ్లి చేయకపోతే సిరి పరిస్థితి ఏంటి? తన కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటని సీతాకంత్ అనగానే.. నీకు ఈ విషయం ఎవరు చెప్పారని శ్రీలత అడుగుతుంది. నా చెల్లి చెప్పింది. అందుకే పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నానని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |